ENGLISH

అబిజీత్‌కి ఓటింగ్‌ ఆ స్థాయిలో వుందా.?

17 December 2020-15:09 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 తెలుగు విన్నర్‌ ఎవరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. టాప్‌ ఫైవ్‌లో వున్న అబిజీత్‌, ఓట్ల పరంగా చాలా ముందున్నాడు. అయితే, అరియానా చాలా వేగంగా దూసుకొస్తోంది. దాంతో అబిజీత్‌, అరియానా అభిమానుల మధ్య 'గొడవ' తారాస్థాయికి చేరుతోంది. మధ్యలో అఖిల్‌ సార్థక్‌ అభిమానుల హంగామా కూడా ఎక్కువైపోతోంది. హారిక, సోహెల్‌ అభిమానులూ సోషల్‌ మీడియాలో బాగానే సౌండ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఎవరు విజేత.? అంటే, అది తేలడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఈలోగా, అభిమానుల మధ్య 'పైత్యం' మాత్రం తారాస్థాయికి చేరిపోయింది.

 

సోషల్‌ మీడియా వేదికగా ఆన్‌లైన్‌ పోల్స్‌ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఓ పోల్‌లో మొత్తం 3 లక్షల ఓట్లు పోల్‌ అయితే, అందులో 69 శాతం ఓట్లు కేవలం అబిజీత్‌కి మాత్రమే పడ్డాయి. ఇదొక్కటి చాలు అబిజీత్‌కి ఫాలోయింగ్‌ ఏ స్థాయిలో వుందో చెప్పడానికి. అయితే, దీన్ని ఎంతవరకు విశ్వసించగలం.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. దాదాపుగా అన్ని పోల్స్‌లోనూ అబిజీత్‌, క్లియర్‌గా డామినేట్‌ చేస్తున్న దరిమిలా, ఓట్ల పరంగా చూసుకుంటే, బిగ్‌బాస్‌ టైటిల్‌ అబిజీత్‌ని దాటి పోవడం కష్టమే. కానీ, బిగ్‌బాస్‌ మైండ్‌లో ఏముందో చెప్పలేమనీ, అది బహుశా ఇంకొకరి పేరు మీద ఇప్పటికే డిసైడ్‌ అయిపోయి వుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అరియానా మీద అబిజీత్‌ అభిమానులు గుస్సా అవుతున్నారు. అఖిల్‌ మీద కూడా ఫైర్‌ అవుతున్నారు. మరోపక్క, అబిజీత్‌ని బ్యాడ్‌ చేయడానికి ఓ 'యాంటీ బ్యాచ్‌' ఇదంతా చేస్తోందన్న ఆరోపణలూ లేకపోలేదు

ALSO READ: గువ్వ - గోరింక‌ మూవీ రివ్యూ & రేటింగ్!