ENGLISH

అద‌ర‌హో.... 'ఆచార్య‌'

22 August 2020-16:00 PM

చిరంజీవి - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. కాజ‌ల్ క‌థానాయిక‌. రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌. ఈ చిత్రం కోసం `ఆచార్య‌` అనే టైటిల్ ముందు నుంచీ ప‌రిశీల‌న‌లో వుంది. ఇప్పుడు అదే ఖ‌రారైంది. ఈరోజు చిరు పుట్టిన రోజు సంద‌ర్భంగా సాయింత్రం నాలుగు గంట‌ల‌కు `ఆచార్య‌` మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు.

 

దేవాదాయ భూములు, న‌క్స‌లిజం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ధ‌ర్మ‌స్థ‌లి కేంద్రంగా సాగుతుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే మోష‌న్ పోస్ట‌ర్ ని డిజైన్ చేశారు. మెడ‌లో ఎర్ర కండువా, చేతిలో క‌త్తి ప‌ట్టుకున్న చిరంజీవి లుక్‌ని.. మోష‌న్ పోస్ట‌ర్ గా విడుద‌ల చేశారు. మ‌ణిశ‌ర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్‌గా వుంది. 2021 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

ALSO READ: ప‌వ‌న్ కోసం పెన్ను ప‌ట్టుకుంటున్న త్రివిక్ర‌మ్‌