ENGLISH

ఆచార్య‌.. రిలీజ్ డేట్ ఫిక్స్‌?

07 July 2021-13:20 PM

చిరంజీవి - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆచార్య‌`. రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. కాజ‌ల్, పూజా హెగ్డే క‌థానాయిక‌లు. మేలోనే ఈసినిమా విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా. లాక్ డౌన్ వ‌ల్ల‌.. వీలు కాలేదు. మ‌రో ప‌ది రోజుల షూటింగ్ బాకీ ఉన్న నేప‌థ్యంలో... ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి, విడుద‌ల చేయాల‌ని చిరు భావిస్తున్నాడ‌ట‌. ఈ సినిమా ద‌స‌రాకి వ‌స్తుంద‌ని అంతా అనుకుంటున్నారు. అయితే ద‌స‌రా కంటే ముందే ఈ సినిమాని విడుద‌ల చేయాల‌న్న‌ది చిరు ఆలోచ‌న‌.

 

ఆగ‌స్టు 22 చిరు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆగ‌స్టు 20నే ఆచార్య‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న ఉంది. ద‌స‌రాకి `అఖండ‌`, `రాధే శ్యామ్` చిత్రాలు రానున్నాయి. ఆ రెండు సినిమాల‌తో పోటీ ప‌డ‌డం కంటే, సోలో రిలీజ్ వ‌ల్ల‌.. వ‌సూళ్లు బాగుంటాయ‌న్న‌ది చిరు అభిప్రాయం. కొర‌టాల శివ కూడా దీనికి ఓకే అన్నాడ‌ని స‌మాచారం. సో... ద‌స‌రా కంటే ముందు.. ఆచార్య‌ని థియేట‌ర్ల‌లో చూడొచ్చ‌న్న‌మాట‌.

ALSO READ: సుంద‌రం ఏమైపోయాడు నానీ..?!