ENGLISH

Chalapathi Rao: చలపతిరావు ఆకస్మిక మరణం

25 December 2022-09:10 AM

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితమే సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ మృతిచెందగా.. ఇప్పుడు ప్రముఖ నటుడు చలపతిరావు (78) ఆకస్మిక మరణంతో టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు చలపతిరావు.

 

1944 మే8న కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించిన చలపతిరావు... 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 1966లో విడుదలైన ‘గూఢచారి 116’ సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్‌, కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్‌ చిత్రాల్లో ఆయన సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ‘కలియుగ కృష్ణుడు’, ’కడప రెడ్డమ్మ’, ‘జగన్నాటకం’, ‘పెళ్లంటే నూరేళ్ల పంట’తదితర చిత్రాలని నిర్మించారు

 

చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.