ENGLISH

అవార్స్డ్ పై ఆసక్తి లేదన్న నాని

05 August 2024-21:24 PM

69వ సౌత్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ ఈవెంట్ ఆదివారం రాత్రి గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకి దక్షిణాది తారలు తరలివచ్చారు. తెలుగులో నానికి 'దసరా' సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. నాని బెస్ట్ యాక్టర్ గా మూడోసారి ఫిలింఫేర్ అందుకున్నాడు. దీంతో నానికి ఫాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు విషెస్ చెప్తున్నారు. నాని ఫిలింఫేర్ అవార్డుతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా బన్నీ నానికి కంగ్రాట్స్ చెప్తూ  'ఈ అవార్డు కి  నువ్వు అర్హుడివి' అని పోస్ట్ చేసాడు. నాని రిప్లై ఇస్తూ థ్యాంక్యూ బన్నీ నెక్స్ట్ ఇయర్ పుష్ప రూల్ తో నువ్వు చాలా అవార్డులు ఇంటికి తీసుకెళ్తావు అని కామెంట్ చేసాడు.  


అయితే నానికి అవార్డుల‌పై అంతగా ఆస‌క్తి లేదన్నాడు. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో న‌టులు స్టేజ్ పై అవార్డులు తీసుకుంటే నేనెప్పుడు అందుకుటానా? అని క‌ల‌లు క‌నేవాడిని అని, ఓరోజు ఆ స్థాయికి వెళ్లాల‌ని బ‌ల‌మైన కోరిక ఉండేదని కానీ ఇప్పుడు ఆ కోరిక తగ్గిపోయిందని చెప్పాడు. నేను అవార్డ్ అందుకోవటం కంటే 'నా సినిమా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు , టెక్నీషియ‌న్లు , న‌టీన‌టుల‌తో పాటు నిర్మాణ సంస్థ‌లో కొత్త‌గా ప‌రిచ‌య‌మైన వారు అవార్డుల అందుకుంటే సంతోషిస్తా అని తెలిపాడు. ఇప్పుడు కూడా తనకి అవార్డు వస్తుందని, అది తీసుకోవటానికి రాలేదని, హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్, దసరా  దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అవార్డులు తీసుకుంటే చూడాల‌ని వ‌చ్చానని' పేర్కొన్నాడు నాని. 


బెస్ట్ డైరక్టర్స్ గా వాళ్లు  గెలుపొందటం, వారికి నా చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని, ఎప్ప‌టికీ గుర్తిండిపోయే ఓ మధుర జ్ఞాప‌కం అని నాని తెలిపారు. కొత్త వాళ్ల తొలి అడుగులో  సక్సెస్ అయితే ఆ విజయంలో నేనూ బాగస్వామ్యం అయితే అదే అతి పెద్ద అవార్డు. ఆ తృప్తి మాట‌ల్లో చెప్ప‌లేనిది' అని నాని సంతోషంగా తెలిపాడు. నాని మాటల్తో అవార్డు తో పాటు అందరి మనసు దోచుకున్నాడు.