ENGLISH

ఆసుప‌త్రిలో ఫృథ్వీరాజ్‌

04 August 2020-14:00 PM

టాలీవుడ్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది క‌రోనా. తొలుత బండ్ల గ‌ణేష్‌కి క‌రోనా సోకింది. ఆ త‌ర‌వాత ఆయ‌న కోలుకున్నారు. ఈమ‌ధ్య‌ రాజ‌మౌళి కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడు తేజ కీ క‌రోనా పాజిటీవ్ అని నిర్దార‌ణ అయ్యింది. ఇప్పుడు హాస్య‌న‌టుడు పృథ్వీరాజ్ కూడా క‌రోనా బారీన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే ధృవీక‌రించారు. సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు ఫృథ్వీ.

 

గ‌త వారం ప‌ది రోజుల నుంచీ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాన‌ని, అన్ని ప‌రీక్ష‌లూ చేయించుకున్నాని, అయితే కోవిడ్ ప‌రీక్ష‌ల్లోనూ నెగిటీవ్ వ‌చ్చింద‌ని, అయితే వైద్యుల సూచ‌న మేర‌కు 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాల్సివ‌చ్చింద‌ని పేర్కొన్నారు. సోమ‌వారం రాత్రి ఆయ‌న హైద‌రాబాద్ లోని ఓ ఆసుప‌త్రిలో చేరారు పృథ్వీ. త‌ను త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని, అందుకు ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలు, భ‌గ‌వంతుడి ఆశీస్సులు కావాల‌న్నారు.

ALSO READ: భలే భలే కాంబో రెడీ అవుతోందా?