ENGLISH

కోలుకుంటున్న ఫృథ్వీరాజ్.

05 August 2020-17:30 PM

క‌రోనాతో బాధ‌ప‌డుతూ.. హాస్య‌న‌టుడు ఫృథ్వీరాజ్ ఆసుప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం రాత్రి ఆయ‌న హైద‌రాబాద్ లోని ఆసుప‌త్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఇప్పుడు ఆయ‌న కోలుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే ఓ వీడియో ద్వారా తెలియ‌ప‌రిచారు. నిన్న‌టికీ, ఈనాటికీ త‌న ఆరోగ్యం వేయి రెట్లు మెరుగుప‌డింద‌ని, త్వ‌ర‌లోనే సంపూర్ణ ఆరోగ్య‌వంతుడ్ని అవుతాన‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

 

వైకాపా ఎం.ఎల్.ఏ అంబ‌టి రాంబాబు త‌న‌కు చాలా మ‌నో ధైర్యాన్ని అందించార‌ని, ఆ స్ఫూర్తితో ఇంకొంచెం త్వ‌ర‌గా రిక‌వ‌రీ అవుతాన‌ని న‌మ్మ‌కంతో చెప్పారాయ‌న‌. తానో ఫైట‌ర్ అని, క‌రోనాపై పోరాడి త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాన‌ని, త్వ‌ర‌లోనే త‌న వాణీ, బాణీ మ‌రోసారి చూపిస్తాన‌ని చెప్పుకొచ్చారు. నిన్న‌టి వీడియోలో పృథ్వీరాజ్ బాగా నీర‌సంగా క‌నిపించారు.

 

ఈసారి... ఆయ‌న‌లో కొత్త ఉత్సాహం క‌నిపించింది. త్వ‌ర‌లోనే ఆయ‌న ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయి, ఎప్ప‌టిలానే షూటింగుల‌తో బిజీ అవ్వాల‌ని కోరుకుందాం.

ALSO READ: ఎస్‌.పి.బి కి క‌రోనా.. ప్ర‌స్తుతం క్షేమం.