ENGLISH

రాజేంద్ర‌ప్ర‌సాద్ కు క‌రోనా

09 January 2022-12:19 PM

క‌రోనా మ‌హ‌మ్మారి టాలీవుడ్ ని ప‌ట్టి పీడిస్తోంది. సినీ స్టార్లంతా.. వ‌రుస‌గా క‌రోనా బారీన ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌హేష్ బాబు, స‌త్య‌రాజ్‌, త‌మ‌న్‌, మంచు లక్ష్మి, మ‌నోజ్‌, విశ్వ‌క్ సేన్‌... వీళ్లంతా క‌రోనా బారీన ప‌డ్డారు. ఈ లిస్టులో చాలామంది ఉన్నా, కొంత‌మంది పేర్లే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా.. న‌ట కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ కూడా క‌రోనా బారీన ప‌డ్డారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. శ‌నివారం స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. క‌రోనా పాజిటీవ్ గా డాక్ట‌ర్లు నిర్దారించ‌డంతో, వెంట‌నే ఆయ‌న ఆసుప‌త్రిలో చేరారు. ప్ర‌స్తుతం రాజేంద్ర ప్ర‌సాద్ ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యులు తెలిపారు.

ALSO READ: మ‌రో జ‌న్మంటూ ఉంటే.. మ‌హేష్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌