బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎన్నో అవార్డులు సాధించాడు. అరుదైన ఘనతలు అందుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా షారుక్ ఏనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాడు. 2024 జులైలో లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్ జ్యూరీ షారుక్ కి ‘కెరీర్ అఛీవ్‌మెంట్ అవార్డు’ ని ప్రధానం చేసింది. అంతే కాదు ‘షారుక్‌లాంటి లివింగ్ లెజెండ్‌ను ఆహ్వానించాలనే కల నెరవేరిందని, ఆయనో సూపర్‌స్టార్. హీరోగా, ప్రొడ్యూసర్‌గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు’ అని ప్రశంసించింది.
లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్ 77వ ఎడిషన్ ఆగస్టు 7 నుంచి 17 వరకు స్విట్జర్లాండ్ లో జరగనుంది. ఆగస్టు 10న షారుక్‌కు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా షారుక్ కెరియర్ లో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన ‘దేవ్‌దాస్’ను ఈ ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు. ఈ అవార్డు సాధించిన ఏకైక ఇండియన్ గా షారుక్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇంతకుముందు ఫ్రాన్సిస్కో రోసీ, జానీ టో వంటి హాలీవుడ్ ప్రముఖులు ఈ పురస్కారం అందుకున్నారు.
మళ్ళీ ఇదే నెలలో ఇంకో అద్భుతం సాధించాడు షారుక్. పారిస్‌లోని గ్రేవిన్ మ్యూజియం షారుక్ పేరు, చిత్రంతో ఒక ప్రత్యేక బంగారు నాణేన్ని రిలీజ్ చేసారు. బాలీవుడ్ నుంచి ఈ ఘనత పొందిన ఒకే ఒక నటుడు షారుక్ కావటం విశేషం. ఇది వరకే షారుక్ మైనపు విగ్రహాలు గ్రేవిన్ మ్యూజియంతో పాటు ప్రపంచంలో 14 చోట్ల ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏకంగా తన పేరుతో గోల్డెన్ కాయిన్ రిలీజ్ చేయటంతో షారుక్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.