ENGLISH

టాలీవుడ్ లో విషాదం.. యువ న‌టుడి ఆత్మ‌హ‌త్య‌

23 January 2023-15:23 PM

గ‌తేడాది టాలీవుడ్ ఎంతోమంది సినీ ప్ర‌ముఖుల్ని కోల్పోయింది. దిగ్గ‌జ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులూ చిత్ర‌సీమ‌ని విషాదంలో ముంచి వెళ్లిపోయారు.

 

తాజాగా ఓ యువ న‌టుడు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం చిత్ర‌సీమ‌ని దిగ్భ్రాంతికి గురిచేసింది. న‌టుడు సుధీర్ వ‌ర్మ ఆత్మ‌హ‌త్య చేసుకొన్నారు. విశాఖ‌ప‌ట్నంలో నివాసం ఉంటుంద‌న్న సుధీర్ వ‌ర్మ ఈరోజు ఉద‌యం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. కుంద‌న‌పు బొమ్మ‌, సెకండ్ హ్యాండ్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు సుధీర్ వ‌ర్మ‌. సినిమాల్లో అవ‌కాశాలు రాక‌పోవ‌డం, ఆర్థిక కార‌ణాలు, కుటుంబ స‌మ‌స్య‌ల‌తో కొంత‌కాలంగా సుధీర్ వ‌ర్మ తీవ్ర‌మైన ఒత్తిడికి గురవుతున్న‌ట్టు స‌న్నిహితులు చెబుతున్నారు.

 

ఈకార‌ణాల‌తోనే ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు స‌మాచారం.సుధీర్ వ‌ర్మ స్నేహితుడు, మ‌రో యువ హీరో సుధాక‌ర్ కోమాకుల సుధీర్ వ‌ర్మ మ‌ర‌ణ వార్త‌ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలియ‌ప‌రిచారు.