ENGLISH

ప్రభాస్ అప్డేటెడ్ గా లేడా?

22 August 2024-14:14 PM

ప్రభాస్ కెరియర్ ని బిఫోర్, ఆఫ్టర్ బాహు బలి అని చెప్పుకోవాలి. అప్పటివరకు కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఛత్రపతి మూవీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టి, మొదటిసారి అందరి దృష్టిలో పడ్డాడు. తరువాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఒక్కో మెట్టు ఎక్కుతూ గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు లేటెస్ట్ గా సలార్, కల్కితో ఓవర్సీస్ లో తిరుగులేని ముద్ర వేసాడు. ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న క్రేజ్, మార్కెట్ కి  అతనితో కలిసి వర్క్ చేయటానికి ఇండియా వైడ్ గా దర్శకులు, హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ డార్లింగ్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. 


కల్కి 1200 కోట్ల వసూళ్లు చేసి తిరుగులేని రికార్డ్ సాధించింది. నెక్స్ట్ ప్రభాస్ నటించే సినిమాలకి మార్కెట్ స్థాయి పెరిగింది. దీనికి తగ్గట్టే దర్శకులని, హీరోయిన్స్ ని ఎంచుకోవాల్సిన ప్రభాస్ హీరోయిన్స్ విషయంలో ఉదాసీనంగా ఉంటున్నాడు. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన సినిమాల్లో  స్టార్ డమ్ ఉన్న హీరోయిన్స్ ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు రాజా సాబ్ లో అస్సలు ఫామ్ లో లేని నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హను రాఘవపూడి సినిమాలో అయినా స్టార్ హీరోయిన్ ఉంటుందని ఆశిస్తే నిరాశే ఎదురయ్యింది. 'ఇమాన్వి ఇస్మాయెల్' అనే డ్యాన్సర్ ని హీరోయిన్ గా రంగంలోకి దింపారు.        


ప్రస్తతం పాన్ ఇండియా ట్రెండ్ కి అనుగుణంగా హీరోయిన్స్ ని ఫిక్స్ చేస్తుంటే డార్లింగ్ సినిమాలకి మాత్రం ఇలా సాదా సీదా గా సెలక్షన్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్ ఈ విషయంలో పక్కా అప్డేటెడ్ గా ఉన్నారని ప్రభాస్ ఫాన్స్ వాపోతున్నారు. కల్కిలో దీపిక లాంటి హీరోయిన్ తో నటించిన డార్లింగ్ నెక్స్ట్ మూవీ కి ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్, కొత్త హీరోయిన్స్ తో జత కట్టడం ఫాన్స్ కి రుచించటం లేదు. ఇక నైనా ప్రభాస్ హీరోయిన్స్ విషయంలో అప్డేటెడ్ గా ఉంటే మంచిదని వారి అభిప్రాయం.