గత నెల జరిగిన బెంగుళూరు రేవ్ పార్టీ విషయాలు పలువుర్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి చెందిన క్యారక్టర్ ఆర్టిస్ట్ హేమ దొరకటం, ఇంకా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారన్న నిజాలు బయటికి రావటంతో అంతా అవాక్కు అయ్యారు. ఈ పార్టీ లో పాల్గొన్న వారికి టెస్ట్ లు చేయగా 88 మందికి పైగా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఇందులో హేమ కూడా ఉండటం గమనార్హం. దీనితో హేమని విచారణకి హాజరు అవమని బెంగుళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
హేమ ఈ నోటీసులని సీరియస్ గా తీసుకోలేదు. తనకి ఫీవర్ అని చెప్పి విచారణకు వెళ్లకుండా డుమ్మా కొట్టింది. పోలీసులు మళ్ళీ నోటీసులు జారీ చేశారు. అసలు బెంగుళూరు పోలీసులు హేమని ఎందుకు అరెస్ట్ చేయలేదని సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఏపీలో పొలిటీషన్స్ కొందరు హేమ అరెస్ట్ ని ఆపుతున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. లేదంటే హేమ రేవ్ పార్టీలో దొరికిన రోజు, లేదా డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపణ అయినా రోజే అరెస్ట్ అయి ఉండేదని గుస గుసలు వినిపించాయి. ఇప్పడు ఈ ఊహగానాలకి తెరదించుతూ బెంగుళూరు సిసిబి పోలీసులు హేమను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
హేమ బెంగుళూర్ సిసిబి పోలీసుల అధీనంలో ఉన్నట్లు, రేవ్ పార్టీ గూర్చి విచారణ చేస్తున్నట్లు సమాచారం. మొదటి నోటీసుకు స్పందించని హేమ, రెండో నోటీసుకి బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరైంది. ఈ నేపథ్యం లోనే హేమను పోలీసులు విచారిస్తున్నారు. హేమ కి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా, అరెస్ట్ చేస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇంకో వైపు హేమని ఇప్పటికే అరెస్ట్ చేసారని, మంగళవారం కోర్ట్ లో హాజరు పర్చనున్నారని వినిపిస్తోంది.