ENGLISH

పోలీసులకు చిక్కిన నివేదా పేతురాజ్

31 May 2024-00:35 AM

ప్రస్తుతం హీరోయిన్ నివేదాపేతురాజ్ సొషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈమధ్య నివేదా పేతురాజ్ వరుస వివాదాల్లో చిక్కుకొంటోంది. మొన్నటివరకు తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ తో రిలేషన్ షిప్ లో ఉందని, దుబాయ్ లో తనకి ఉదయనిధి ఇల్లుకూడా కొనిపెట్టాడని రక రకాల వార్తలు వినిపించాయి. ఇవన్నీ భరించలేక లాస్ట్ కి మీడియా ముందుకు వచ్చి వేడుకుంది. ఇలాంటి నిరాధార మైన వార్తలు ప్రచారం చేయొద్దని, తన కష్టార్జితంతో బతుకుతున్నట్లు పేర్కొంది. ఇదంతా సద్దు మణిగింది అనుకునేసరికి ఇప్పుడు మరొక వివాదంలో చిక్కుకుంది. 


తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించిన నివేదా పేతురేజ్. తెలుగులో చివరిసారిగా దాస్ కా ధమ్కీ సినిమాలో నటించింది. ప్రస్తుతం నివేదాకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో నివేదా పేతురేజ్ కార్ లో వెళ్తుంటే పోలీసులు చెకింగ్ కోసం ఆపారు. డిక్కీ ఓపెన్ చేయమని అడగ్గా చేయను,పేపర్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి చూసుకోండి అంటూ పోలీసులతో గొడవ పడుతోంది. మా డ్యూటీ మేము నెరవేర్చాలి ఒకసారి ఓపెన్ చేయండి అని రిఖ్వెస్ట్ చేసినా, ససేమిరా అంటూ ఇది నా పరువుకు సంబంధించిన విషయం చేయను అంది. ఇదంతా రికార్డ్ చేస్తుంటే ఎందుకు రికార్డ్ చేస్తున్నారు అంటూ సీరియస్ అయ్యింది.  


కామన్ గా చేసే చెకింగ్ ని నివేదా ఎందుకు అంత వ్యతిరేకించింది. డిక్కీ ఓపెన్ చేస్తే పరువు పోయేంత ఏం జరుగుతుంది. అసలు డిక్కీలో ఏముంది అనే సందేహాలు పలువురిలో మొదల య్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నిజంగానే నివేదా పేతురేజ్ తన డిక్కీలో ఏమైనా తీసుకెళ్తుందా? పోలీసులకు చెకింగ్ కి సహకరించడానికి ఎందుకు భయపడుతుంది అని కొందరు, ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసినట్లు ఉంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే నివేదాని పోలీసుల అపారా? ఏదైనా సినిమాకోసం చేసిన ప్రమోషన్ స్టంటా అన్నది తెలియాల్సి ఉంది.