ENGLISH

Aditi Rao: సిద్దార్థ్‌తో ల‌వ్ ఎఫైర్‌... అతిథి ఏమందంటే..?

06 March 2023-15:00 PM

సిద్దార్థ్ - అతిథిరావు హైద‌రీ మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్ థింగ్ న‌డుస్తోంద‌ని మీడియాలో వార్త‌లొస్తున్నాయి. చిత్ర‌సీమ కూడా దాన్ని గ‌ట్టిగానే న‌మ్ముతోంది. ఎందుకంటే.. ఎక్క‌డికి వెళ్లినా ఇద్ద‌రూ క‌లిసే వెళ్తున్నారు. ఈమ‌ధ్య రీల్స్ కూడా చేస్తున్నారు. ఇద్ద‌రూ క‌లిసి `మ‌హా స‌ముద్రం`లో జంట‌గా న‌టించారు. అప్ప‌టి నుంచీ... ఇద్ద‌రి మ‌ధ్యా అనుబంధం బ‌ల‌ప‌డింది. ఇప్ప‌టికీ ఇద్ద‌రూ క‌లిసే ఉంటున్నారు. తాజాగా.. సిద్దార్థ్ పై ప్రేమ వ్య‌వ‌హారంపై అతిథిరావు స్పందించింది.

 

''జ‌నాలకు మాట్లాడుకోవ‌డానికి ఏదో ఒక‌టి ఉండాలి. వాళ్లు అలా మాట్లాడుకొంటూనే ఉంటారు. వాళ్ల‌కు ఏ విష‌యంలో ఆస‌క్తి ఉందో.. వాటిని వెదుకుతూ ఉంటారు. వాళ్ల‌ని ఆప‌లేం. అందుకే నేనైతే ఇలాంటి కామెంట్ల‌ని ప‌ట్టించుకోను. చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచీ నా ప‌ని నాదే. ఎవ‌రి గురించీ ఆలోచించాల‌నుకోవ‌డం లేదు. నాలో ప్ర‌తిభ ఉన్న‌న్ని రోజులు ద‌ర్శ‌కులు అవ‌కాశాలు ఇస్తారు. ప్రేక్ష‌కులు న‌న్ను ఆదరించేంత వ‌ర‌కూ సినిమాలు చేస్తూనే ఉంటాను. సినిమాలు చేసినంత వ‌ర‌కూ నేను సంతోషంగానే ఉంటాను'' అంటూ బ‌దులిచ్చింది. నేరుగా సిద్దార్థ్ తో త‌న అనుబంధాన్నిస్ప‌ష్టం చేయ‌క‌పోయినా.. సిద్దార్థ్ తో క‌లిసి ఉండ‌డంలోనే త‌నకు ఆనందం ఉంద‌న్న సంకేతాల్ని ఈ వ్యాఖ్య‌ల ద్వారా ఇచ్చిన‌ట్టైంది.