ENGLISH

ప‌ల్లెబాట ప‌ట్టిన స్టార్ హీరోలు

31 March 2021-10:01 AM

పల్లెటూరు, ఆ నేప‌థ్యంలో సాగే క‌థ‌ల‌పై.. పెద్ద హీరోలు మ‌న‌సు చేసుకుంటున్నారు. మ‌హేష్ బాబు.. `మ‌హ‌ర్షి` ఆ టైపు క‌థే. ఇప్పుడు చిరంజీవి, బాల‌కృష్ణ‌లు సైతం.. ఈ బ్యాక్ డ్రాప్‌లో క‌థ‌లు ఎంచుకోనున్నారు. చిరంజీవి - బాబి కాంబినేష‌న్‌లో ఓసినిమా రూపుదిద్దుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇది ప‌ల్లెటూరు నేప‌థ్యంలో సాగే క‌థ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి `వీర‌య్య‌` అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని స‌మాచారం అందుతోంది. అలానే నంద‌మూరి బాల‌కృష్ణ - గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇది కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే క‌థ అట‌.

 

ఇందులో బాల‌య్య గ్రామ స‌ర్పంచ్‌గా న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఈ రెండు క‌థ‌ల్లోనూ ఉన్న కామన్ పాయింట్... ప‌ల్లెటూరు. శ్రీ‌మంతుడు, మ‌హ‌ర్షి కూడా దాదాపు ఈ నేప‌థ్యంలో సాగే సినిమాలే. గ్రామాల ద‌త్త‌త‌పై శ్రీ‌మంతుడు ఫోక‌స్ చేస్తే... మ‌హ‌ర్షిలో వ్య‌వ‌సాయం కీల‌క అంశం అయ్యింది. అలానే ఈ రెండు క‌థ‌లూ ప‌ల్లెటూరి నేప‌థ్యంలోంచి వ‌చ్చినా - ఓ యూనిక్ పాయింట్ తో సాగ‌బోతున్నాయ‌ని స‌మాచారం. మ‌రి ఆ ఆ పాయింట్ ఏమిటో? వాటిని ద‌ర్శ‌కులు ఎలా డీల్ చేయ‌బోతున్నారో? బాల‌య్య‌, చిరులు ప‌ల్లెటూరి హీరోల్లా ఎలా మెర‌వ‌బోతున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: ర‌కుల్ వ్యాపారం.. భారీ న‌ష్టాల‌ట‌!