ENGLISH

అఘోరా పాత్ర‌ని లేపేశారా?

24 November 2020-11:00 AM

క‌రోనా వ‌ల్ల చాలా మార్పులు వ‌చ్చాయి, రాబోతున్నాయి కూడా. చిత్ర‌సీమ కూడా ఆ మార్పుల‌కు అనుగుణంగా కొత్త న‌డ‌క‌లు ప్రారంభించింది. సినిమా బ‌డ్జెట్ల‌ను నియంత్రించుకోవాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే, క‌థ‌ల్నీ మార్చుకోవాల్సి వ‌స్తోంది. తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ సైతం ఈ జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు స‌మాచారం. నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాల‌య్య రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని, అందులో ఒక‌టి అఘోరా పాత్ర అని ప్ర‌చారం జ‌రిగింది.

 

అఘోరా పాత్ర కోసం బాల‌య్య పై టెస్ట్ షూట్ కూడా చేశార్ట‌. అయితే... ఇప్పుడు అఘోరా పాత్ర‌ని పూర్తిగా తీసేయాల‌ని ఫిక్స‌యిన‌ట్టు టాక్‌. ఇందులో బాల‌య్య ఒకే ఒక్క పాత్ర‌లో క‌నిపించేలా క‌థ‌ని మార్చార‌ని స‌మాచారం అందుతోంది. లాక్ డౌన్ స‌మ‌యంలో స్క్రిప్టుని మార్చుకునేందుకు త‌గినంత స‌మ‌యం ద‌క్కింది. ఈ ఖాళీ టైమ్ లో.. ఈ క‌థ‌పై బోయ‌పాటి మ‌ళ్లీ క‌స‌ర‌త్తులు చేశాడ‌ని, మార్పులు చేర్పుల‌లో భాగంగా అఘోరా పాత్ర‌ని పూర్తిగా తీసి ప‌క్క‌న పెట్టాడ‌ని, ఈ మార్పు బాల‌య్య‌కీ న‌చ్చింద‌ని తెలుస్తోంది.

ALSO READ: తెలంగాణలో థియేట‌ర్ల‌కు అనుమ‌తి