ENGLISH

ఆహాకి ఖాయ‌మైన అక్కినేని సినిమాలు

04 July 2021-12:06 PM

ఆహా ప్ర‌యాణం మొద‌లై... రెండేళ్లు దాటేసింది. ఇప్ప‌టికైతే.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో క‌ళక‌ళ‌లాడుతోంది. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని మంచి సినిమాల‌తో త‌న బ్యాంక్ ని పెంచుకోవాల‌నుకుంటోంది. అందులో భాగంగా కొత్త సినిమాల్ని భారీ రేటు వెచ్చించి కొనుగోలు చేస్తోంది. తాజాగా అక్కినేని హీరోల‌కు సంబంధించిన సినిమాలు ఆహాకి వెళ్లిపోయాయ‌ని టాక్‌.

 

నాగ‌చైత‌న్య - సాయిప‌ల్ల‌వి కాంబోలో రూపొందిన చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడు. ఈచిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ఆహాకి వెళ్లిపోయాయి. థియేట‌ర్ లో రిలీజ్ అయిన త‌ర‌వాతే.. ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మ‌రోవైపు అఖిల్ సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` రైట్స్ సైతం ఆహా ద‌గ్గ‌రే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా థియేట‌ర్లో కంటే ముందుగా ఆహాలో వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎప్పుడో సిద్ధ‌మైంది. అయితే.. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు బంద్ అయ్యాయి. దాంతో థియేట‌రిక‌ల్ రిలీజ్ సాధ్యం కాలేదు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 నిర్మించింది. అందుకే ఆహాలోనే నేరుగా విడుద‌ల చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ALSO READ: విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్‌