ENGLISH

హాట్‌ శర్మ.. ఫోకస్‌ టాలీవుడ్‌పై పెట్టిందిగా.!

31 October 2020-12:00 PM

అక్క నేహా శర్మ తెలుగులో రెండు సినిమాలకే దుకాణం సర్దేసినా, తెలుగు సినిమాలపై చెల్లెలు ఐషా శర్మకి ఆసక్తి వుందట. ‘చాలా అనుకుంటాం, కొన్ని జరుగుతాయ్‌.. కొన్ని జరగవ్‌.. అలాగని, ఆలోచనల్ని ఆపలేం కదా..’ అంటోంది ఐషా శర్మ, తెలుగు సినీ పరిశ్రమ గురించి ఓ ప్రశ్న వస్తే. స్ట్రెయిట్‌గా తెలుగు సినీ పరిశ్రమ గురించి కాకుండా, సౌత్‌ సినిమాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఐషా శర్మని ప్రశ్నిస్తే, నటనకు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ అన్న తేడాలేమీ వుండవని సమాధానమిచ్చిన ఐషా శర్మ, తన సోదరి నేహా శర్మ తెలుగులో రెండు సినిమాలు చేసిందనీ, తనకూ తెలుగు సినీ పరిశ్రమ పట్ల ఆసక్తి వుందనీ చెప్పుకొచ్చింది.

 

ఆసక్తి వుంది సరే, అవకాశాల మాటేమిటి.? అంటే, టైం ఎవరికి ఎప్పుడెలా కలిసొస్తుందో తెలియదనీ, తాను మాత్రం ఆశాభావంతోనే వున్నాననీ అంటోంది ఐషా శర్మ. బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాలతో బాగానే పాపులారిటీ పెంచుకుంటోన్న ఐషా శర్మ, స్పెషల్‌ సాంగ్స్‌ అయినాసరే, సౌత్‌లో అడుగు పెట్టడానికి తాను సిద్ధంగానే వున్నానని స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. సినిమా సంగతుల్ని పక్కన పెడితే, సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుండే ఐషా శర్మ, తన హాట్‌ హాట్‌ ఫొటోలతో కుర్రకారుకి కిర్రాకు పుట్టించేస్తుంటుంది. ‘అందం చూడవయా.. ఆనందించవయా..’ అన్నదే తన స్లోగన్‌ అని చెబుతోంది ఐషా శర్మ.

ALSO READ: Aisha Sharma Hot Photoshoot