కరోనా మహమ్మారి మరింతగా రెచ్చిపోతోంది. టాలీవుడ్ లో సెలబ్రెటీలను ఒకొక్కరిగా ఆవహిస్తోంది. అందులో కొంతమంది వేగంగానే రికవరీ అవుతుండడం ఆనందించే విషయమే అయినా, ఒకొక్కరుగా కరోనా బారీన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆర్.ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి సైతం కరోనా బారీన పడ్డారు.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో పరోక్షంగా ప్రస్తావించారు. `త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా` అంటూ ట్వీట్ చేశారు అజయ్. కరోనా వచ్చి, నయం అయిన వాళ్లు ప్లాస్మా ఇవ్వడానికి అర్హులు. అంటే.. అజయ్‌కి కరోనా సోకిందన్నమాట. అన్నట్టు ఈరోజు (గురువారం) అజయ్ భూపతి పుట్టిన రోజు. హాయిగా.. పుట్టిన రోజు జరుపుకోవాల్సిన అజయ్ భూపతి.. ఇప్పుడు క్వారంటైన్ లో గడుపుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.
ALSO READ: పవన్ సినిమా పని మొదలుపెట్టిన థమన్