ENGLISH

పాపం అఖిల్‌.. అలా పులిహోర అయిపోయాడు.!

21 December 2020-18:03 PM

కంటెస్టెంట్స్‌ ఎంతమంది వున్నా.. ఒకరే విజేత అవుతారు. అలా బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌కి సంబంధించి అబిజీత్‌ విజేత అయ్యాడు. అఖిల్‌ రన్నరప్‌గా నిలిచాడు. మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్‌. నాలుగు, ఐదు స్థానాల్లో అరియానా, హారిక నిలిచారు. ఇదీ టాప్‌ ఫైవ్‌ కథ. కానీ, ఇక్కడ నైతిక విజయం ఎవరిది.? అంటే, ముమ్మాటికీ అరియానా గ్లోరీదేనన్న వాదన ఒకటి బలంగా వినిపిస్తోంది. సరే, గెలుపోటముల సందర్భంగా ఇలాంటి మాటలు విన్పించడం సహజమే.

 

'సగం ప్రైజ్‌ మనీ వచ్చేస్తోంది కదా..' అంటూ విజయాన్ని లైట్‌ తీసుకున్నాడు సోహెల్‌. ఈ సీజన్‌ వరకూ 'త్యాగజీవి' అనే పేరు పదే పదే సొంతం చేసుకున్న సోహెల్‌, ఇప్పుడు పూర్తిస్థాయిలో 'స్వార్ధపరుడు' అనే కొత్త అవతారమెత్తాడు. సోహెల్‌ త్యాగాలతో టాప్‌ 5.. టాప్‌ 2 వరకూ వచ్చిన అఖిల్‌, చివరికి పులిహోర అయిపోయాడు. టాప్‌ ఫైవ్‌లో లేకపోయినా మెహబూబ్‌ని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.

 

దివి అయితే మెగాస్టార్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది. 'ఈ తరానికి రాజబాబు అవ్వాలి..' అంటూ అవినాష్‌ని ఆశీర్వదించారు చిరంజీవి. అబిజీత్‌ ఎలాగూ విన్నర్‌. అరియానాకి కూడా చిరంజీవి నుంచి ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి. కానీ, రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌ పరిస్థితేంటి.? మొత్తంగా పులిహోర అయిపోయాడు. 'మమ్మీ..' అని ఏడ్చి, సీక్రెట్‌ రూం నుంచి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌, తనకు తాను 'పుడింగి' అనుకున్నాడుగానీ.. అంత సీన్‌ లేదని తేలిపోయింది. కుమార్‌ సాయి అన్నాడని కాదుగానీ, పులిహోరలో కరివేపాకులా తయారైపోయిందిప్పుడు అఖిల్‌ పరిస్థితి.

ALSO READ: టైటిల్ మార్చేసిన సందీప్‌రెడ్డి