ENGLISH

అక్ష‌య్‌కుమార్ కు క‌రోనా... బాలీవుడ్ లో టెన్ష‌న్‌

04 April 2021-11:03 AM

క‌రోనా కొత్త కొత్త రూపాలు సంత‌రించుకుంటోంది. ఇది వ‌ర‌క‌టి కంటే వేగంగా విస్త‌రిస్తోంది. సెల‌బ్రెటీలు సైతం.... కరోనా బాధితులుగా మారిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్షయ్‌ కుమార్‌ కరోనా బారీన ప‌డ్డారు. ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలియ‌జేశారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, వైద్య చికిత్సలు చేయించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల తనను సంప్రదించిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

 

ఇటీవ‌ల‌‌ రామ్‌ సేత షూటింగ్‌లో పాల్గొన్నారు అక్షయ్‌. అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అక్ష‌య్ కు క‌రోనా సోక‌డంతో ఇప్పుడు ఆ టీమ్ అంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సివ‌స్తోంది. అంతేకాదు.. అక్ష‌య్ ఇంటి స‌భ్యుల‌కు, సిబ్బందికి కూడా కోవిడ్ టెస్టులు చేయించారు. ఆ రిపోర్టులు రావాల్సివుంది.

ALSO READ: వైల్డ్ డాగ్‌... ఓపెనింగ్ రిపోర్టేంటి?