ENGLISH

అక్కడ డబుల్ సెంచరీ కొట్టిన అల వైకుంఠపురములో

09 August 2020-10:10 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటుగా సినిమాలోని పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టిస్తున్నాయి.


 'అల వైకుంఠపురములో' సినిమా పాటలను జియో సావన్ యాప్ లో యూజర్లు 200 మిలియన్ల సార్లు ప్లే చెయడం జరిగిందట.  ఒక సౌత్ సినిమాకు ఈ స్థాయిలో పాటలు ప్లే చేయడం చాలా గొప్ప విషయం. దీంతో ఈ సినిమా పాటలు ఏ స్థాయిలో విజయం సాధించాయి అనేది మరొక సారి అందరికీ తెలిసింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను ఇప్పటికీ అలరిస్తున్నాయి. 


ముఖ్యంగా బుట్ట బొమ్మ లాంటి పాటలు దేశవ్యాప్తంగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమా ఆడియోను మరిపించే మరో ఆల్బమ్ రాకపోవడంతో  'అల వైకుంఠపురములో' హంగామా అసలు ఆగడం లేదు.

ALSO READ: తేజ‌.. ష్‌... స్టోరీస్‌!