ENGLISH

బ‌న్నీ సినిమా మ‌రో రికార్డ్‌!

27 August 2020-14:37 PM

ఈ సంక్రాంతికి విడుద‌లై... సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. నాన్ బాహుబ‌లి రికార్డులన్నీ బ్రేక్ చేసి, టాలీవుడ్ లో టాప్ 2 సినిమాగా నిలిచింది. ఇప్పుడు టాప్ 1 స్థానంలోకి వెళ్లింది. టీఆర్ పీ ప‌రంగా. ఇటీవ‌ల జెమినీలో ఈ సినిమా టెలీకాస్ట్ అయ్యింది. ఏకంగా 29..4 రేటింగు సంపాదించింది. తెలుగు సినిమాల‌కు సంబంధించినంత వ‌ర‌కూ ఇదే రికార్డ్‌.

 

త్రివిక్ర‌మ్ సినిమాల‌కు మంచి టీఆర్‌పీలు వ‌స్తాయి. అత‌డు, ఖ‌లేజా లాంటి సినిమాలు టీవీల్లో ఎన్నిసార్లు చూడ్డానికైనా ప్రేక్ష‌కులు సిద్ధంగానేఉంటారు. పైగా సంక్రాంతికి విడుద‌లై.. సూప‌ర్ హిట్టు కొట్టిన సినిమా ఇది. కాబ‌ట్టే... ఇంత రేటింగు వ‌చ్చింది. హారిక హాసిన క్రియేష‌న్స్ సంస్థ ఈ విషయాన్ని ట్విట్ట‌ర్‌లో అధికారికంగా ప్ర‌క‌టించింది. ''థియేట‌ర్లో విడుద‌లై 7 నెల‌లైంది. ఓటీటీలోకి వ‌చ్చి ఆరు నెల‌లైంది. అయినా స‌రే.. ఇంత‌టి మంచి రేటింగు ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు'' అని ట్విట్ట‌ర్‌లో పేర్కొంది.

ALSO READ: మూడేళ్లకు త్రిష సినిమాకు విముక్తి.