ENGLISH

అలియాని రాజ‌మౌళి వ‌ద‌ల‌డా?

08 March 2022-11:14 AM

త‌న హీరోయిన్ల‌ను రిపీట్ చేసే అల‌వాటు త్రివిక్ర‌మ్‌కి మాత్ర‌మే ఉంది. మిగిలిన వాళ్లు.. త‌మ సినిమాల్లో కొత్త కొత్త హీరోయిన్ల‌ని తెచ్చి పెట్టుకుంటుంటారు. రాజ‌మౌళి కూడా అంతే. త‌న సినిమాలో ఏ హీరోయిన్‌ని ఇంత వ‌ర‌కూ రిపీట్ చేయ‌లేదు. అయితే అలియాభ‌ట్ తో ఈ లెక్క మార‌బోతోంద‌ని టాక్.

 

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో అలియా భ‌ట్ క‌థానాయిక అనే సంగ‌తి తెలిసిందే. ఈ బాలీవుడ్ బ్యూటీ న‌టిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఇప్పుడు అలియాకు మ‌రో ఆఫ‌ర్ ఇచ్చాడు రాజ‌మౌళి. త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో ఓసినిమా చేస్తున్నాడు రాజ‌మౌళి. ఇందులో క‌థానాయిక‌గా అలియా భ‌ట్ దాదాపుగా ఖాయ‌మైపోయింద‌ని స‌మాచారం. ఆర్‌.ఆర్‌.ఆర్ సెట్లో అలియా అంకిత‌భావం, క‌ష్ట‌ప‌డే త‌త్వం ఇవ‌న్నీ న‌చ్చే, త‌న‌కు మ‌రో ఛాన్స్ ఇవ్వాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడ‌ట‌. పైగా.. మ‌హేష్ తో సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెర‌కెక్కించ‌బోతున్నాడు. క‌చ్చితంగా బాలీవుడ్ హీరోయిన్ కావాల్సిందే. అందుకే ముందుగానే అలియాపై క‌ర్చీఫ్ వేసేశాడు.

ALSO READ: జగన్ కి థ్యాంక్స్ : చిరు