ENGLISH

అంద‌రి దృష్టీ.. ఈ సినిమాపైనే

24 December 2020-17:00 PM

చాలా రోజుల త‌ర‌వాత‌.. ఆ మాట కొస్తే.. నెల‌ల త‌ర‌వాత థియేట‌ర్ల ద‌గ్గ‌ర సంద‌డి మొద‌లు కాబోతోంది. శుక్ర‌వారం సోలో బ‌తుకే సో బెట‌రు విడుద‌ల కాబోతోంది. క్రిస్మస్ హ‌డావుడి, పైగా చాలా రోజుల త‌ర‌వాత కొత్త సినిమా ... కాబ‌ట్టి ప్రేక్ష‌కులంతా ఈ సినిమా వైపు ఆస‌క్తిగా చూస్తున్నారు. చిత్ర‌సీమ కూడా సోలో బ‌తుకుపై దృష్టి పెట్టింది. లాక్ డౌన్ త‌ర‌వాత థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతున్న పెద్ద సినిమాఇది. జ‌నాల మూడ్ సినిమాల‌పై ఉందా, లేదా? అనేది తెలుసుకోవ‌డానికి ఈ సినిమా ఫ‌లితం ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

ఈ సినిమా హిట్ట‌యి, మంచి వ‌సూళ్లు వ‌స్తే, వ‌చ్చే వారం నుంచి కొత్త సినిమాల ఉధృతి క‌నిపిస్తుంది. లేదంటే... సంక్రాంతి వ‌ర‌కూ ఆగాల్సిందే. ప్ర‌భాస్ లాంటి హీరోలు ముందుకొచ్చి... థియేట‌ర్ల‌లోనే సినిమా చూడండి.. అంటూ వీడియో బైట్ లు విడుద‌ల చేయిస్తున్నారు. అంటే.. థియేట‌ర్ల తీత‌, కొత్త సినిమాల రాక‌.. ఎంత అవ‌స‌ర‌మో అర్థం అవుతుంది. నిజానికి జీ 5 ఈ సినిమా హ‌క్కుల్ని కొనుక్కుంది. 25న జీ 5లోనే ఈ సినిమా విడుద‌ల కావాల్సివుంది. కానీ.. ముందు థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసి, ఆ ఫ‌లితాన్ని చూసుకుని అప్పుడు ఓటీటీలో మెల్ల‌గా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ALSO READ: 'మ‌ర్డ‌ర్‌' మూవీ రివ్యూ & రేటింగ్!