ENGLISH

అల్ల‌రోడి క‌థ‌లో... అజ‌య్ దేవ‌గ‌ణ్‌

25 June 2021-14:00 PM

2021లో టాలీవుడ్ చూసిన మంచి చిత్రాల్లో `నాంది` ఒక‌టి. సెక్ష‌న్ 211 గురించి చ‌ర్చించి, అవ‌గాహ‌న క‌ల్పించిన సినిమా ఇది. న‌రేష్ లోని న‌టుడిని కొత్త కోణంలో చూపించింది. ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం ల‌భించాయి. `నాంది`ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్ల‌డానికి సన్నాహాలు మొద‌లెట్టేశారు.

 

అల్ల‌రి న‌రేష్ పాత్ర‌కు గానూ.. అజ‌య్ దేవ‌గ‌ణ్ ని ఎంచుకున్నార‌ని స‌మాచారం. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం అజ‌య్ దేవ‌గ‌ణ్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడే.. `నాంది` సినిమాని ఆయ‌న కు ప్ర‌త్యేకంగా చూపించార‌ని, అజ‌య్ కి ఈ క‌థ బాగా న‌చ్చింద‌ని, సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడ‌ని తెలుస్తోంది. `నాంది`లో వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్ పాత్ర చాలా కీల‌కం. ఆ పాత్ర కోసం.. ఓ ప్ర‌ముఖ మాజీ హీరోయిన్ ని ఎంచుకోవాల‌ని చూస్తున్నార్ట‌. ఆమె ఎవ‌రో తెలిస్తే... న‌టీనటుల ఎంపిక పూర్త‌యిపోయిన‌ట్టే. మ‌రి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త ఎవ‌రికి అప్ప‌గిస్తారో చూడాలి.

ALSO READ: అప్ప‌టి విక్ర‌మార్కుడు.. ఇప్ప‌టి రాక్ష‌సుడు