ENGLISH

అల్ల‌రోడితో ఎస్.వి కృష్ణారెడ్డి మ్యాజిక్‌!

01 May 2019-11:19 AM

అల్ల‌రి న‌రేష్ కెరీర్ గంద‌ర‌గోళంలో ప‌డింది. మ‌హ‌ర్షి సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చి, న‌రేష్ పాత్ర‌కు పేరొస్తే త‌ప్ప న‌రేష్ జాత‌కం సెట్ అవ్వ‌దు. మ‌ల్టీస్టారర్ సినిమాల‌తో స‌ర్దుకుపోవాల‌న్నా సోలో హీరోగా అవ‌కాశాలు రావాల‌న్నా మ‌హ‌ర్షి హిట్ అవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే మ‌హ‌ర్షి విడుద‌ల‌కు ముందే అల్ల‌రోడికి ఓ మంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు టాక్‌.

 

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్.వి కృష్ణారెడ్డితో న‌రేష్ ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఇదో సోషియో ఫాంట‌సీ క‌థ అని, ఇందులో మ‌రో క‌థానాయ‌కుడు కూడా ఉంటాడ‌ని తెలుస్తోంది. `య‌మ‌లీల 2` తరువాత ఎస్.వి. కృష్ణారెడ్డి మ‌రో సినిమా చేయ‌లేదు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అంత‌కు ముందు కూడా ఎస్.వి కృష్ణారెడ్డి సినిమాల‌కు ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. ఆయ‌న ట్రెండ్ కి త‌గ్గ సినిమా చేస్తారా? చేయ‌గ‌ల‌రా? ఈత‌రం ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌గ‌ల‌రా? అనే బోలెడు అనుమానాలున్నాయి. పైగా న‌రేష్ కూడా ఫ్లాపుల‌లో ఉన్నాడు. మ‌రి వీరిద్ద‌రి కాంబో ఎలా వ‌ర్కువుట్ అవుతుందో చూడాలి.

ALSO READ: ఆ రెండూ రకుల్‌కి కీలకమే.!