ENGLISH

నాన్న, నేను ఓన్లీ ఫన్‌, నో ఫ్రస్ట్రేషన్‌: బన్నీ

02 May 2019-12:00 PM

తన తండ్రితో తనకు విభేదాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొట్టి పారేశాడు. అలాంటి విభేదాలకు అసలు ఆస్కారమే లేదని చెప్పాడు. 'మేం ఎప్పుడు కలుసుకున్నా పని, జీవితం గురించే మాట్లాడుకుంటాం' అని చెప్పిన అల్లు అర్జున్‌, వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరం కలుస్తూనే వుంటామనీ, ఎప్పుడూ ఆనందంగా వివిధ అంశాలపై చర్చించుకోవడం తప్ప, అభిప్రాయ బేధాలు తలెత్తిన సందర్భాలు కూడా వుండవని అన్నాడు.

 

'ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో నాకు అర్థం కావడంలేదు. మా నాన్న మాకు రోల్‌ మోడల్‌. ఆయన విషయంలో నా ఆలోచనల్లో ఎప్పుడూ మార్పు రాలేదు. నా విషయంలో నా తండ్రి ఆలోచనల్లోనూ మార్పు వుండదు' అని చెబుతూ, ఇలాంటి పుకార్లు ఫన్‌ క్రియేట్‌ చేస్తాయి తప్ప, వీటిపై ఫ్రస్ట్రేషన్‌ చెందాల్సిన అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డాడు. ఓ సందర్భంలో ఈ గాసిప్స్‌ గురించి తమ మధ్య చర్చ జరిగితే, కాసేపు ఇద్దరం నవ్వుకున్నామని, గాసిప్స్‌ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని తన తండ్రి తనకు సూచించారని చెప్పాడు. కెరీర్‌ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం త్రివిక్రమ్‌తోపాటు సుకుమార్‌ డైరెక్షన్‌లోనూ సినిమాలు చేస్తున్నాననీ, కొత్త తరహా పాత్రలు చేయాలనే తపనతో వున్నాననీ అన్నాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

ALSO READ: అనాధ పిల్లల కోసం అవెంజర్స్ స్పెషల్ షో వేసిన సుప్రీం హీరో