ENGLISH

నచ్చాయన్న బన్నీ.. హ్యాపీ అన్న పూరి.

14 August 2020-09:30 AM

దర్శకుడు పూరి జగన్నాధ్ తూటా లాంటి మాటలకు, పంచ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని డైలాగులు చాలా పాపులర్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య పూరి తన మనసులోని భావాలను పంచుకుంటూ పాడ్ కాస్ట్ లను విడుదల చేస్తున్నారు. వివిధ అంశాలపై తన మనసులోని అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. సూటిగా ఎటువంటి తికమక లేకుండా పూరి వ్యక్తపరిచే ప్రాక్టికల్ అభిప్రాయాలు చాలా మంది నెటిజన్లకు నచ్చుతున్నాయి.

 

తాజాగా ఈ పాడ్ కాస్ట్ లపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా బన్నీ ట్వీట్ చేస్తూ, "మీ పాడ్ కాస్ట్ ల టాపిక్స్, మీరు వాటిపై వ్యక్తంచేసే నిజాయితీతో కూడిన అభిప్రాయాలు అద్భుతం. నాకు వ్యక్తిగతంగా అవన్ని చాలా నచ్చాయి. మీ మీద మరింతగా అభిమానం పెరిగింది. మీరు ఇలాంటి మరెన్నో అంశాలపై పాడ్ కాస్ట్ లు విడుదల చేయాలని కోరుకుంటున్నాను" అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ ట్రీట్ కు స్పందించిన పూరి, "బన్నీ.. మీ ట్వీట్ చదివి నేను చాలా సంతోషపడ్డాను. ఓ విజయవంతమైన యువకుడి దగ్గర నుంచి ఇది నాకు లభించిన పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను.

 

ఈ రోజు రాత్రి మీ పేరుతో ఒక ఎక్స్ట్రా పెగ్. ఛీర్స్. లవ్ యు" అంటూ రిప్లై ఇచ్చారు. ఇక పూరి జగన్నాథ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'ఫైటర్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే చిత్రంలో నటిస్తున్నారు.

ALSO READ: బాలయ్యకు ఆ విలన్ ను సెట్ చేసిన బోయపాటి