ENGLISH

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప రాజ్ బిజినెస్ ఎంత?

19 October 2024-13:57 PM

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2' రిలీజ్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బన్నీ  సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప భారీ విజయాన్ని సాధించి, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు తెచ్చి పెట్టింది. ఇపుడు పార్ట్ 2 పై కూడా అంచనాలు పెంచింది. డిసెంబర్ 6 న పుష్ప రాజ్ సందడి మొదలవనుంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్సిన పుష్ప దేశవిదేశాల్లో క్రేజ్ తెచ్చుకోవటంతో పార్ట్ 2 ని మరింత శ్రద్దగా తీర్చి దిద్దారట సుకుమార్. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ రివ్యూ అంటూ పుష్ప 2 ఎలా ఉంటుందో హింట్ ఇచ్చాడు. ప్రమోషన్స్ కోసం కూడా చాలా టైం  వెచ్చించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.        


ఇప్పటివరకున్న పాన్ ఇండియా లెక్కల్ని చెరిపేందుకు పుష్ప 2 ప్రయత్నాలు చేస్తోంది. రికార్డ్ స్థాయిలో  ఓపెనింగ్స్ సాధించేలా సినిమాను డిజైన్ చేస్తున్నట్లు టాక్. పుష్ప2 వెయ్యి కోట్ల టార్గెట్ తో వస్తున్నాడట. ఈ క్రమంలోనే పుష్ప రాజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోందని టాక్. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ సేల్ అయ్యాయని తెలుస్తోంది. ఏపీలో అన్ని ఏరియాలకి కలిపి టోటల్ గా  90 కోట్లు వచ్చాయని సమాచారం. ఉత్తరాంధ్ర రైట్స్ ఒక్కటే 23 కోట్లకి సేల్ అయ్యాయట. రాయలసీమ రైట్స్ 30 కోట్లకు అభిషేక్ రెడ్డి కొన్నట్టు  సమాచారం. 


విశాఖ రైట్స్ సాయి కొర్రపాటి, కృష్ణా జిల్లా రైట్స్ 'బన్నీ' వాసు, గుంటూరు రైట్స్ యూవీ క్రియేషన్స్ వంశీ, వెస్ట్ గోదావరి రైట్స్ LVR, నెల్లూరు రైట్స్ భాస్కర రెడ్డి, ఈస్ట్ గోదావరి రైట్స్ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో పుష్ప 2 రైట్స్ 90 కోట్లకు అమ్ముడవగా, తెలంగాణ రైట్స్ మైత్రి మూవీస్ ఎవరికీ ఇవ్వలేదు. తమ సొంత డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేయాలని అనుకుంటు న్నారట. రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ టోటల్ గా 190 కోట్లని టాక్. మిగతా భాషల ధియేటర్ రైట్స్, డిజిటల్ డీల్స్ ఉండనే ఉన్నాయి.