ENGLISH

చరణ్ కి దీటుగా బన్నీ!

10 March 2021-14:48 PM

'ఆర్ ఆర్ ఆర్' తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖాతాలో మరో ప్యాన్ ఇండియా చిత్రం రానుంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక భారీ చిత్రం చేయనున్నట్టు అధికారిక ప్రకటన ద్వారా ఇప్పటికే తెలియజేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ చిత్రం.

 

మరోపక్క రామ్ చరణ్ కి దీటుగా బన్నీ కూడా మరో పాన్ ఇండియా చిత్రం ప్లాన్ చేయనున్నాడు. ఇప్పటికే 'పుష్ప' తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఒకేసారి తమిళ్, మలయాళం, కన్నడ మరియు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. పుష్ప తరువాత కూడా బన్నీ మరో ప్యాన్ ఇండియా చిత్రం చేయనున్నాడట.

 

కేజీఎఫ్, కేజీఎఫ్2, సలార్ తో సత్తా చాటనున్న ప్రశాంత్ నీల్ తో బన్నీ సంప్రదింపులు జరుపుతున్నాడట. ఇప్పటికే వీరి మధ్య భేటీ కూడా జరిగిందని ప్రచారం జరుగుతుంది. మరి బన్నీ కోసం ప్రశాంత్ నీల్ ఎలాంటి కథ రెడీ చేస్తాడో వేచి చూడాలి.

ALSO READ: హ్యాట్రిక్ ఫ్లాపుల త‌ర‌వాత‌... కోలుకుంటాడా?