ENGLISH

అల్లుడు తొంద‌ర‌ప‌డుతున్నాడా?

08 January 2021-10:39 AM

ఈ సంక్రాంతికి అల్లుడు సంద‌డి క‌నిపించ‌బోతోంది. `అల్లుడు అదుర్స్‌` ఈనెల 15న రాబోతోంది. సంక్రాంతి సీజ‌న్‌లో రాబోతున్న చివ‌రి సినిమా అదే. అయితే... ఇప్పుడు నిర్మాత‌ల ఆలోచ‌న మారిన‌ట్టు స‌మాచారం. అల్లుడుని కాస్త ముందే విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార్ట‌. 9న క్రాక్‌, 13న మాస్ట‌ర్‌, 14న రెడ్ విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. 12 ఖాళీగా ఉంది. కాబ‌ట్టి 12 న విడుద‌ల చేస్తే.. మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. క‌నీసం 14న అయినా.. రిలీజ్ చేయాల‌న్న‌ది లేటెస్ట్ ప్లాన్.

 

14న రెడ్ విడుద‌ల అవుతోంది... కావ‌ల్సిన‌న్ని థియేట‌ర్లు దొరక్క‌పోయినా ఫ‌ర్వాలేదు.. 14న తీసుకొద్దామ‌న్న‌ది ఆలోచ‌న‌. 12న కావ‌ల్సిన‌న్ని థియేట‌ర్లు దొరికి, క్రాక్ ఫ‌లితం అటూ ఇటూ అయితే.. క‌చ్చితంగా 12నే విడుద‌ల చేస్తార్ట‌. మొత్తానికి `అల్లుడు అదుర్స్` డేట్ మార‌డం మాత్రం ఖాయ‌మైంది. అదెప్పుడో తెలియాలంటే ఒక‌ట్రెండు రోజులు ఆగాలి.

ALSO READ: మహేష్ సినిమాలో రేణూ...క్లారిటీ వ‌చ్చేసింది