ENGLISH

'కుడి ఎడ‌మైతే' టీజ‌ర్ టాక్‌: జ‌రిగిందే మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌రిగితే

03 July 2021-12:42 PM

యూట‌ర్న్ సినిమాతో కావల్సినంత థ్రిల్ ఇచ్చాడు ప‌వ‌న్ కుమార్‌. ఇప్పుడు ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ రూపొందించాడు. అదే `కుడి ఎడ‌మైతే`. అమ‌లాపాల్, రాహుల్ విజ‌య్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈనెల 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. టీజర్ ఈ రోజు విడుద‌లైంది. అమ‌లాపాల్ ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. రాహుల్ విజ‌య్‌... స్విగ్గీలో ప‌నిచేస్తుంటాడు. ఈ రెండు పాత్ర‌ల‌కూ సంబంధ‌మే ఉండ‌దు. కానీ ఓ యాక్సిడెంట్ వీరిద్ద‌రి జీవితాల్ని మార్చేస్తుంది.

 

`నీకెప్పుడైనా జ‌రిగిందే మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌రుగుతున్న‌ట్టు అనిపించిందా` అనే డైలాగ్ వినిపించింది ఈ టీజ‌ర్ లో. ఈ క‌థ కంటెంట్ కూడా స‌రిగ్గా అలాంటిదే. ఓకే సంఘ‌ట‌న మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌ర‌గ‌డం.. అది క‌లో, నిజ‌మో తేల్చుకోలేక‌పోవ‌డం - ఈ క‌థ కాన్సెప్ట్‌. వింటుంటే వెరైటీగా ఉంది క‌దా. మ‌రి దాన్ని స్క్రీన్ పై ఎలా తీసుకొచ్చాడో చూడాలి. మొత్తానికి టీజ‌ర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. మ‌రి... రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: వ‌డ్డీతో స‌హా.. ముట్ట‌జెబుతున్న దిల్ రాజు