ENGLISH

అమృతా రావు అమ్మ అయ్యింది

02 November 2020-17:11 PM

అమృతా రావు గుర్తుందా? మ‌హేష్ బాబు `అతిథి`లో క‌థానాయిక‌. ఈ సినిమా త‌ర‌వాత‌.. తెలుగులో ఆమెకు అవ‌కాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ వెళ్లిపోయింది. `ది లిజెండ్ ఆఫ్ భ‌గ‌త్‌సింగ్‌`, దీ వార్‌, మ‌స్తీ, మై హూనా, వివాహ్ వంటి చిత్రాలు అమృత‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. కొన్ని సినిమాలు చేశాక‌... అన్‌మోల్ అనే రేడియో జాకీని ప్రేమించి, పెళ్లి చేసుకుంది.

 

కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్న ఉద్దేశంతో శాశ్వ‌తంగా సినిమాల‌కు దూర‌మై జీవితంలో స్థిర‌ప‌డింది. ఇప్పుడు త‌ల్లిగా ప్ర‌మోష‌న్ తెచ్చుకుంది. ఆదివారం ముంబైలోని ఓ ఆసుప‌త్రిలో అమృతారావు పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. త‌ల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. ఇటీవ‌ల అమృత‌కు కొన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా, ఆమె తిర‌స్క‌రించిన‌ట్టు స‌మాచారం. బ‌హుశా వెండి తెర‌పై అమృత‌ని ఇక చూడ‌లేమేమో.??

ALSO READ: చిరు - శ్రీ‌దేవి... చేజారిన ఓ రీమేక్‌