ENGLISH

గ్లామ్‌షాట్‌: హాట్‌ అండ్‌ స్పైసీ 'అమీ' గ్లామర్‌.!

04 December 2018-17:44 PM

2017లో టెస్ట్‌ షూట్‌ కోసం కెమెరాకి ఇలా పోజిచ్చిందట హాట్‌ బ్యూటీ అమీజాక్సన్‌. ఇంత హాట్‌గా టెస్ట్‌ షూట్‌ ఎందుకు చేయించుకుంది అమీజాక్సన్‌ అని మాత్రం అడక్కండి. అది మీరే గెస్‌ చేయండని మనకే సవాల్‌ విసిరిందీ హాట్‌ బ్యూటీ. ఇకపోతే అప్పుడెప్పుడో తమిళంలో ఓ పీరియాడిక్‌ మూవీతో ఆర్యకు జోడీగా నటించి, సినీ కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఈ బ్యూటీ తర్వాత బాలీవుడ్‌లో ఫిక్సయిపోయింది.

తెలుగులో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిన 'ఎవడు' చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో నటించింది. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తమిళంలో విక్రమ్‌ సరసన నటించిన 'ఐ' చిత్రంతో సౌత్‌లో అందరికీ సుపరిచితురాలైంది మరోసారి. రీసెంట్‌గా 'రోబో 2.0'తో సూపర్‌స్టార్‌కి జోడీగా నటించి, సూపర్‌ సక్సెస్‌ కొట్టింది.

హాట్‌నెస్‌లో అమ్మడికి హద్దులేం లేవని గతంలోనే పలు మార్లు ప్రూవ్‌ అయ్యింది. ఈ హాట్‌పిక్‌ చూస్తే అమీజాక్సన్‌లో మరీ ఇంత గ్లామర్‌ దాగుందా.? అని ఇంకోసారి అవాక్కవ్వాల్సిందే మరి.! 

ALSO READ: Qlik Here Amy Jackson Hot Photoshoot