ENGLISH

అమీ కూల్‌ - ఆమె హాట్‌!

02 September 2017-13:28 PM

చల్లదనం కోసం కొబ్బరి బొండాల్ని ఆశ్రయించిన అమీ జాక్సన్‌, హాట్‌ అప్పీల్‌ని పండించడంలో మాత్రం తగ్గలేదనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. షూటింగ్‌ గ్యాప్‌లో కొబ్బరిబొండాం చేత పట్టుకుని, అందులో నీళ్ళు తాగుతూ కూల్‌ అవుతున్న అమీ జాక్సన్‌, అయామ్‌ హాట్‌ అని సంకేతాలిచ్చింది. చక్కనమ్మ ఏం చేసినా అందమేనని వెనకటికి ఓ మహానుభావుడు చెప్పిన మాట నూటికి నూరుపాళ్ళూ నిజమని ఇదిగో అమీజాక్సన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫొటోనే నిరూపిస్తోంది. అమీజాక్సన్‌ ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'రోబో-2' సినిమాలో నటిస్తోంది. అంతకు ముందు శంకర్‌ దర్శకత్వంలోనే అమీజాక్సన్‌ 'ఐ' సినిమాలో నటించింది హాట్‌ హాట్‌గా అందాల విందు చేసిన సంగతి తెలుసు కదా!

ALSO READ: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే