ENGLISH

రెడ్‌ కార్పెట్‌పై హాట్‌ బ్యూటీ

18 January 2018-10:26 AM

'చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప..' అంటూ ఓ సూపర్‌ హిట్‌ సాంగ్‌ ఉంది తెలుగులో. అందాల భామలు క్యూట్‌ క్యూట్‌గా హాట్‌ హాట్‌గా ఈ పొట్టి గౌనుల్లో మెరిసిపోవడం మామూలే. కొందరికి ఇవి క్యూట్‌గా అనిపిస్తే, ఇంకొందరికి హాట్‌గా అనిపిస్తుంటాయి. మరికొందరికి ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇక్కడ ఈ పొటోలో అమైరా దస్తుర్‌ని పొట్టి గౌనులో చూస్తే ఎవరైనాసరే 'క్యూట్‌ అండ్‌ హాట్‌ లుక్‌' అనాల్సిందే. ఓ ఈవెంట్‌లో రెడ్‌ కార్పెట్‌పై ఇలా చిట్టిపొట్టి గౌనులో అమైరా దస్తుర్‌ ఇలా మెరిసిపోయింది. తెలుగులో సందీప్‌ కిషన్‌ సరసన 'మనసుకు నచ్చింది' సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లోనూ, తమిళంలోనూ ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఓ తమిళ సినిమాలోనూ, పలు హిందీ సినిమాల్లోనూ ఇప్పటికే నటించింది ఈ బ్యూటీ. శరీరానికి సూటయ్యే కాస్ట్యూమ్స్‌ ధరిస్తే, క్యూట్‌ అండ్‌ హాట్‌గా కన్పించడంతోపాటు కంఫర్ట్‌గా ఉంటుందనీ, హాట్‌ అప్పీల్‌ కోసం ఫిజిక్‌కి సూటవని డ్రెస్‌లు వేసుకుంటే అసభ్యతకు తావిచ్చినట్లవుతుందని చెబుతుంటుంది అమైరా దస్తుర్‌. మోడలింగ్‌ రంగం నుంచి సినిమాల్లోకొచ్చిన ఈ బ్యూటీకి బికినీ అయినా, పొట్టి గౌన్లు అయినా, చీరలైనా అదుర్స్‌ అనిపించేలా గ్లామరస్‌గానే అన్పిస్తాయ్‌. అదే ఆమె ప్రత్యేకత.

ALSO READ: Qlik Here For The Gallery