ENGLISH

అన‌సూయ మాస్ట‌ర్ స్ట్రోక్‌!

17 February 2021-10:12 AM

బుల్లి తెర‌పైనే గ‌ర‌మ్ గ‌ర‌మ్ సెగ‌లు ర‌ప్పించ‌గ‌ల‌దు... అన‌సూయ‌. ఇక వెండి తెర‌పై ఎంట్రీ ఇస్తే.. చెప్పాల్సిన ప‌నిలేదు. రంగ‌మ్మ‌త్త‌గా.. అన‌సూయ విజృంభ‌ణ చూసేశాం. కొన్ని ఐటెమ్ గీతాల్లోనూ త‌న ప్ర‌తాపం అర్థ‌మైపోయింది. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకు వేయ‌బోతోంద‌ట‌. అన‌సూయ మ‌రింత హాట్ గా క‌నిపించ‌డానికి రెడీ అయిపోయింద‌ట‌.

 

మారుతి - గోపీచంద్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీనికి `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` అనే పేరు ఖ‌రారు చేశారు. ఇందులో అన‌సూయ‌కు ఓ గ‌ర‌మ్ పాత్ర ద‌క్కింద‌ని తెలుస్తోంది. ఇందులో అన‌సూయ వేశ్య‌గా క‌నిపించ‌బోతోంద‌ని టాక్‌. దానికి త‌గ్గ‌ట్టే ఆ పాత్ర చాలా హాట్ గా ఉంటుంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ అన‌సూయ ఇలాంటి పాత్ర చేయ‌లేద‌ని, వెండి తెర‌పై అన‌సూయ‌ని చూసిన వాళ్లంతా షాక్ కి గుర‌వుతార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు ఇప్ప‌టి నుంచే ఊరించ‌డం మొద‌లెట్టాయి. మ‌రి... ఏ రేంజులో అన‌సూయ సెగ‌లు రేపుతుందో చూడాలి.

ALSO READ: ప‌వ‌న్‌తో పూజా హెగ్డే?