ENGLISH

అనసూయ అది వదులుకోక తప్పదా?

30 January 2021-10:06 AM

బుల్లితెరపై హాటెస్ట్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ ఇకపై ఆ బుల్లితెరకు గుడ్‌ బై చెప్పక తప్పదా.? అంటే అవుననే అంటున్నారు కొందరు. ఎందుకంటారా.? పెద్ద తెరపై అమ్మడికి హాట్‌ హాట్‌గా ఆఫర్స్‌ వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే అనసూయ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి తమిళ సినిమా కావడం విశేషం. తెలుగులో అనసూయ నటిస్తున్న 'థాంక్యూ బ్రదర్‌' సినిమా టీజర్‌ రీసెంట్‌గా విడుదలై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రెగ్నెంట్‌గా ఉన్న అనసూయ లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడాన్ని ఈ టీజర్‌లో చూపించారు.

 

ఇదో థ్రిల్లర్‌ మూవీ అని తెలుస్తోంది. దీంతో పాటు, తెలుగులో 'చావు కబురు చల్లగా' సినిమాలో అనసూయ స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోంది. కార్తికేయ ఈ సినిమాలో హీరో. కాగా, వీటితో పాటు మరిన్ని బిగ్‌ ఆఫర్స్‌ అనసూయకు క్యూ కడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సో, ఇకపై అనసూయను బుల్లితెరపై చూడలేమంటున్నారు. బుల్లితెరపై ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ, బిగ్‌ స్క్రీన్‌ ఆఫర్స్‌ని నమ్ముకుని బుల్లితెరకు గుడ్‌ బై చెబుతుందా.? గతంలోనూ అనసూయకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

 

కానీ, అప్పుడూ బుల్లితెరను వదులుకోలేదు. ఆ మాటకొస్తే, తానెంత బిజీగా ఉన్నా, బుల్లితెరను వదిలి పెట్టే ప్రశక్తే లేదని గతంలో చాలా సార్లు అనసూయ చెప్పింది. ఇప్పుడు కూడా అదే అంటోందట. అయితే, జబర్దస్త్‌ నుండి తాత్కాలికంగా బ్రేక్‌ తీసుకోవాలని అనసూయ అనుకుంటోందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారం. చూడాలి మరి.

ALSO READ: Anasuya Latest Photoshoot