ENGLISH

ప‌వ‌న్ ఫ్యాన్ పై... అన‌సూయ ఫైర్‌

11 April 2021-11:29 AM

హీరోలంద‌రికీ అభిమానులుంటారు. కానీ.. వాళ్ల‌లో ప‌వ‌న్ అభిమానులు వేరు. వాళ్లు భ‌క్తుల కంటే ఎక్కువ‌. ప‌వ‌న్ ని దేవుడి కంటే ఎక్కువ‌గా ఆరాధిస్తుంటారు. అయితే ఆ అభిమానం ఒక్కోసారి హ‌ద్దులు దాటుతుంటుంది. తాజాగా ఓ అభిమాని ప‌వ‌న్ పై చూపించిన వెర్రి అభిమానం చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

 

శుక్ర‌వారం వ‌కీల్ సాబ్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ ఆడుతున్న థియేట‌ర్ల ముందు ప‌వ‌న్ అభిమానులు చేసిన హంగామా గుర్తుండే ఉంటుంది. ఓ అభిమాని అయితే ఏకంగా.. తెర ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, ర‌క్తంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు రాశాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. `మ‌రీ ఇంత పిచ్చి ఉండ‌కూడ‌దు`అంటూ చాలా మంది.. అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అన‌సూయ కూడా ఈ వెర్రిత‌నంపై ఫైర్ అయ్యింది. ఇదేం వెర్రి అభిమానం? ఇలాంటివి చూస్తూ మిగిలిన‌వాళ్లు ఎలా ఊరుకున్నారు? ఇలాంటి ప‌నుల వ‌ల్ల త‌ల్లిదండ్రులు ఎంత బాధ ప‌డ‌తారో ఆలోచించారా`` అంటూ బాధ ప‌డిపోయింది. అభిమానం చాటుకోవ‌డానికి చాలా దారులు ఉన్నాయ‌ని, కొంచెం బాధ్య‌తాయుతంగా న‌డ‌చుకోవాలంటూ హిత‌వు ప‌లికింది. మ‌రి ప‌వ‌న్ ఫ్యాన్స్ వింటారా?

ALSO READ: వ‌కీల్ సాబ్‌... జోరు ఎప్ప‌టి వ‌ర‌కు?