ENGLISH

మాన‌సికంగా మాన‌భంగం చేస్తున్నారు

28 August 2020-10:31 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌న‌లం సృష్టిస్తున్న పంజాగుట్ట రేప్ కేసులో యాంక‌ర్ ప్ర‌దీప్ పేరు కూడా బ‌లంగా వినిపిస్తోంది. యాంక‌ర్ ప్ర‌దీప్ అన‌గానే.. ప్ర‌దీప్ మాచినేని ఫొటోలు పెట్టి, త‌నపై సోష‌ల్ మీడియాలో జనాలు ట్రోల్ చేస్తున్నారు. టీవీ ఛాన‌ళ్ల‌లోనూ... ప్ర‌దీప్ ఫొటోనే చూపిస్తున్నారు. దాంతో.. ప్ర‌దీప్ తీవ్ర స్థాయిలో మ‌న‌స్తాపాన్ని వ్య‌క్తం చేస్తున్నాడు. ``నిజానిజాలేంటో తెలుసుకోకుండా నా ఫొటోనీ, నా పేరు ని వాడుకోవ‌డం దారుణం. ఇది న‌న్ను మాన‌సికంగా మాన‌భంగం చేసిన‌ట్టే. నాకూ ఓ కుటుంబం ఉంటుంది. ఇవ‌న్నీ చూసి వాళ్లెంత బాధ ప‌డ‌తారో అర్థం చేసుకోండి.

 

చ‌ట్టం, న్యాయం ఉన్నాయి. ఎవ‌రు త‌ప్పు చేశారో అవినిర్దారిస్తాయి. అప్ప‌టి వ‌ర‌కూ ఓపిక ప‌ట్టండి. అస‌లు ఈ కేసులో నా పేరు ఎలా వ‌చ్చిందో నాకు తెలీదు. ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్ మెంట్ అందించ‌డం త‌ప్ప నాకేం తెలీదు. రాదు. చాలా క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చాను. నాపై బుర‌ద చ‌ల్ల‌కండి. ఇది చాలా సున్నిత‌మైన అంశం. జ‌రిగిన దానికీ నాకూ ఎలాంటి సంబంధం లేదు. ఇవేం తెలుసుకోకుండా... నా పేరు, నా ఫొటోలూ వాడుకుంటే, త‌ప్ప‌కుండా వాళ్ల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటా`` అని హెచ్చ‌రించాడు ప్ర‌దీప్‌.

ALSO READ: ట‌బు కోటికి ప‌డిపోతుందా?