ఈ మధ్య ఎక్కడ చూసినా బాలయ్య సందడే కనిపిస్తోంది. ఒక వైపు రాజకీయాలు, నియోజక వర్గ ప్రజలతో మమేకం అవటం ఇంకో వైపు సినిమాలు, రియాల్టీ షోల సందడి. బాలయ్య ప్రస్తుతం బాబీతో NBK109 వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో బాలయ్య సంక్రాంతో బరిలో నిలవనున్నారు. నెక్స్ట్ బోయపాటితో అఖండ 2 పూజ కార్య క్రమాలు ముగించారు. ఇపుడు ఆహాలో అన్ స్టాపబుల్ షో కోసం సిద్ధం అయిపోయారు. ఇలా అన్ని రంగాల్లో కృషి చేస్తూ, అందరితో జై బాలయ్య అనిపించుకుంటున్నారు.
ఈ మధ్యే 50 ఏళ్ళ నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని ఎన్టీఆర్ నట వారసత్వాన్ని, రాజకీయ వారసత్వాన్ని రెండిటిని కొనసాగిస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. బాలయ్య నుంచి ఫాన్స్ రెండు విషయాలకి ఎదురు చూసారు. అందులో ఒకటి బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ, రెండు బాలయ్యకి పద్మభూషణ్. ఇందులో ఒకటి ఇప్పటికే నెరవేరింది. మోక్షజ్ఞ సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ఇక మిగిలింది బాలయ్యకి పద్మభూషణ్ రావటం. ఇప్పుడు బాలయ్య ఫాన్స్ రెండో కల కూడా నెరవేరే ఛాన్స్ ఉన్నట్లు టాక్.
బాలయ్యకి పద్మభూషణ్ రావాలని నందమూరి ఫాన్స్ తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. బాలయ్య సమకాలికుడు అయిన చిరుకి ఇప్పటికే పద్మభూషణ్, పద్మ విభూషణ్ రెండూ వచ్చాయి. కానీ బాలయ్యకి ఒక్కటి కూడా రాలేదు. ఏపీలో ప్రస్తుతమున్న కూటమి సర్కార్ బాలయ్య పలు రంగాలలో చేసిన సేవలకు గుర్తింపుగా పద్మ భూషణ్ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసిందని సమాచారం. పొలిటికల్ లీడర్ గా, సినీ నటుడిగా, సామాజిక సేవా కర్తగా బాలయ్య సేవల్ని గుర్తించి కేంద్రం కూడా 2025 గణతంత్ర వేడుకల్లో బాలయ్య పేరు అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో పాటు మాజీ ఎంపీ, నటుడు 'మురళీమోహన్' పేరుని కూడా పద్మభూషణ్ పురస్కారానికి కూటమి సర్కార్ సిఫార్సు చేసినట్లు టాక్.