ENGLISH

15 నిమిషాల సీన్‌.. ఒంటిమీద బ‌ట్ట‌ల్లేవ్‌!

30 April 2022-17:13 PM

కొంత‌మంది క‌థానాయిక‌లు ఎంత‌టి రిస్క్ అయినా తీసుకోవ‌డానికి వెనుకంజ వేయ‌రు. బోల్డ్ గా క‌నిపించే అవ‌కాశం వ‌స్తే.. ఏమాత్రం ఆలోచించ‌రు. గ్లామ‌ర్ కోసం స్కిన్ షో చేయ‌డం వేరు.. క‌థ డిమాండ్ చేస్తే... ఎంత‌టి క్లిష్ట‌మైన స‌న్నివేశంలో అయినా న‌టించ‌డానికి ఓకే చెప్ప‌డం వేరు. ఆండ్రియా ఇప్పుడు అదే చేస్తోంద‌ట‌.

 

ఆమె ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం `పిశాచి 2`. మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇదో హార‌ర్ సినిమా. గ‌తంలో వ‌చ్చిన పిశాచి 1 సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు సీక్వెల్ తీశారు. ఈ సినిమాలో క‌థ ప్ర‌కారం కొన్ని స‌న్నివేశాల్లో ఆండ్రియా న‌గ్నంగ క‌నిపించాల‌ట‌. దానికి ఆండ్రియా ఒప్పుకుంద‌ని, దాదాపు 15 నిమిషాల పాటు.. ఆండ్రియా.. ఒంటిమీద బ‌ట్ల‌ల్లేకుండానే క‌నిపిస్తుంద‌ని తెలుస్తోంది. అయితే ఆ స‌న్నివేశాలేం అస‌భ్యంగా, అభ్యంత‌ర‌క‌రంగా లేకుండా మిస్కిన్ జాగ్ర‌త్త ప‌డ్డాడ‌ట‌. ఇది వ‌ర‌కు అమ‌లాపాల్ కూడా ఓ సినిమాలో ఇలానే న‌గ్నంగా న‌టించి షాక్ ఇచ్చింది. అయితే ఆ సినిమాకు జ‌నాద‌ర‌ణ ద‌క్క‌లేదు. కాక‌పోతే.. అమ‌లాపాల్ న‌గ్నంగా న‌టించింద‌న్న వార్త‌ల‌తో ఆ సినిమాకి మంచి హైప్ వ‌చ్చింది. ఈసారీ అదే జ‌ర‌గొచ్చు.

ALSO READ: చిరు నమ్మకం ఓడింది.. రాజమౌళి సెంటిమెంట్ గెలిచింది