ENGLISH

అఖిల్ తో స‌ర్దుకుపోతాడా?

06 August 2020-14:16 PM

వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ ఫామ్ లో ఉన్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఇప్ప‌టి వ‌ర‌కూ 5 సినిమాలు తీస్తే.. ఐదూ హిట్టే. పైగా ఒక‌దాన్ని మించి మ‌రో విజ‌యం. అన్నీ కుదిరితే ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉండాల్సింది. కానీ.. క‌రోనా వ‌ల్ల ప్లానింగుల‌న్నీ తారుమారు అయ్యాయి. ఎఫ్ 3 స్క్రిప్టుని అనిల్ రావిపూడి తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చింది. ఆ స్థానంలో మ‌రో సినిమాని మొద‌లెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు అనిల్.

 

బాల‌య్య కోసం రాసుకున్న `రామారావు గారూ` సినిమాని ప‌ట్టాలెక్కిద్దాం అనుకున్నాడు. అయితే అదంత ఈజీ కాదు. బోయపాటి శ్రీ‌ను సినిమా పూర్త‌యితే గానీ, బాల‌య్య కమిట్మెంట్ ఇవ్వ‌లేడు. అందుకే ఆ ప్రాజెక్టునీ ప‌క్క‌న పెట్టి, మ‌రో యువ హీరోతో ఓ సినిమా చేద్దామ‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. అనిల్ దృష్టిలో ఉన్న ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు... అఖిల్‌. దిల్ రాజు బ్యాన‌ర్‌లో అఖిల్ ఓ సినిమా చేయాలి. దాన్ని ఇప్పుడు ప‌ట్టాలెక్కించేస్తే బాగుంటుంద‌ని దిల్ రాజు భావిస్తున్నాడ‌ట‌. అఖిల్ కి స‌రిప‌డ క‌థ‌.. అనిల్ రావిపూడి ద‌గ్గ‌ర కూడా ఉంద‌ని తెలుస్తోంది. సో.. అన్నీ కుదిరితే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ త‌ర‌వాత అఖిల్ ప్రాజెక్టు ఇదే కావొచ్చు.

ALSO READ: పూజ‌... ఓన్లీ ఫ‌ర్ స్టార్ హీరోస్‌!