ENGLISH

నాగేశ్వ‌ర‌రావుతో జ‌ట్టుక‌ట్టిన అనుప‌మ్‌ఖేర్‌

02 August 2022-10:01 AM

బాలీవుడ్ లో అనుప‌మ్ ఖేర్‌కి ఉన్న క్రేజ్ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌శాబ్దాలుగా అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నారు. ఆయ‌న ఇప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నారు. `కార్తికేయ 2`లో ఓ కీల‌క పాత్ర పోషించారు. ఆ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు మ‌రో తెలుగు ప్రాజెక్టుపై సంత‌కాలు చేశారు. అదే.. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ర‌వితేజ‌కు ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఇందులో ఓ ముఖ్య పాత్రకు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా.. అనుప‌మ్ ఫ‌స్ట్ లుక్‌ని కూడా విడుద‌ల చేసింది.

 

టైగర్ నాగేశ్వర రావు కోసం రవితేజ సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 7 కోట్లు ఖర్చు చేసి ఒక పెద్ద సెట్‌ను చిత్రబృందం నిర్మించి అందులో చిత్రీకరణ జరుపుతున్నారు. రవితేజ సరసన నుపుర్ సనన్ ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇతర కీలక పాత్రల్లో రేణు దేశాయ్, గాయత్రి భార్గవి కనిపించబోతున్నారు.

ALSO READ: ఆగ‌స్టులో అయినా టాలీవుడ్ జాత‌కం మారుతుందా?