ENGLISH

ముంబై వరదల్లో చిక్కుకున్న సినీ ప్రముఖులు

30 August 2017-11:50 AM

నిన్నటీరోజున ముంబై మహానగరాన్ని వరణుడు వణికించాడు అనే చెప్పాలి. నిన్న ఒక్కరోజే దాదాపు 30 సెంటిమీటర్ల వర్శపాతం నమోదయింది. దీనితో ముంబై ఒక్కసారిగా సముద్రాన్ని తలపించేలా మొత్తం వరద నీటితో మునిగిపోయింది.

ఈ వరదలో సామాన్య ప్రజానీకంతో పాటుగా సినీ తారలు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తన కారు వరదల్లో చిక్కుకోగా ఆయన తన స్నేహితుడి సహాయంతో అందులో నుండి బయటపడి వారి ఇంట ఆశ్రయంపొందారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

ఇక నటులు మాధవన్, హ్యుమా ఖురేషి లు తమ వాహనాలని రోడ్లపైనే వదిలిపెట్టి, నడుములోతు వరద నీటిలో తమ గమ్యస్థానాలకి చేరుకోవడం జరిగింది.

ప్రస్తుతానికి వరద నీటిని నియంత్రించ గలిగాము అంటూ ముంబై పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన జారీ చేశారు.

 

ALSO READ: 'సాహో'లో మిల్కీ బ్యూటీ