ENGLISH

అనుష్క కాదంటోంది, కానీ అక్కడ ఔనంటున్నారు!

01 October 2020-14:00 PM

‘ఆదిపురుష్‌’ సినిమాలో అనుష్క నటిస్తోందా? లేదా? అన్న విషయమై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే వుంది. ‘నన్ను ఇంతవరకూ ఎవరూ ఆ సినిమా కోసం సంప్రదించలేదు’ అనుష్క స్పష్టం చేసేసిన దరిమిలా, ఇప్పటిదాకా విన్పించిన ఊహాగానాలు ఉత్త పుకార్లుగానే చాలామంది కొట్టిపారేస్తున్నారు. అయితే, ‘ఇప్పటిదాకా సంప్రదించలేదు. కానీ, ఇకపై సంప్రదించే అవకాశాలు వున్నాయి కదా..’ అంటున్నారు కొందరు.

 

‘ఆదిపురుష్‌’ లాంటి పాన్‌ ఇండియా సినిమాకి అనుష్క ఇమేజ్‌ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. సౌత్‌లో ఈ సినిమాకి క్రేజ్‌ రావాలంటే ప్రభాస్‌ స్టామినాకి తగ్గట్టుగా హీరోయిన్‌ కూడా వుండాలి. ప్రభాస్‌ ఇమేజ్‌ని మ్యాచ్‌ చేయగల సత్తా సౌత్‌లో అనుష్కకి మాత్రమే వుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ ఇప్పటికే గుర్తించారనీ, అయితే సంప్రదింపులు కొంత ఆలస్యమవుతున్నాయనీ అంటున్నారు. కరోనా నేపథ్యంలో ఒక్కో పనీ చాలా నెమ్మదిగా సాగుతోంది ‘ఆదిపురుష్‌’కి సంబంధించి.

 

అతి త్వరలో అనుష్కతో ‘ఆదిపురుష్‌’ టీమ్ సంప్రదింపులు జరపనుందనేది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. రెమ్యునరేషన్‌ విషయంలో ఇబ్బంది పెట్టకపోవడం, సినిమా నిర్మాణం ఆలస్యమైనా సహకరించడం.. ఇలాంటి చాలా చాలా మంచి క్వాలిటీస్‌ అనుష్కకే సొంతం. అందుకే అనుష్కని ‘ఆది పురుష్‌’ టీమ్ వదులుకునే ప్రసక్తే వుండదని అంటున్నారు. ‘సీత’ పాత్రలో నటిస్తుందా.? వేరే పాత్రలో కనిపిస్తుందా? అనే చర్చ పక్కన పెడితే, ‘ఆదిపురుష్‌’ అనుష్క నటించి తీరుతుందనే ఊహాగానాలు చాలా బలంగా వినిపిస్తూనే వున్నాయి.

ALSO READ: రానా - శ్రుతిహాస‌న్ జంట‌గా!