ENGLISH

'అర్జున్‌రెడ్డి' ని మెచ్చుకున్న అనుష్క

07 September 2017-14:45 PM

'అర్జున్‌రెడ్డి' సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తోంది. కానీ ఏదో మూల నుండి ఈ సినిమాకి సంబంధించి సెన్సేషనల్‌ న్యూస్‌ వస్తూనే ఉంది. కలెక్షన్స్‌ జోరు కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్‌లో కూడా వీర కుమ్ముడు కుమ్మేస్తున్నాడు 'అర్జున్‌రెడ్డి'. సామాన్య జనం బ్రహ్మరథం పట్టారు. వివాదాల వల్లో చిక్కుకున్నప్పటికీ, అవేమీ సినిమా కాన్సెప్ట్‌ ముందు, కథ ముందు నిలవలేకపోయాయి. సినిమా విజయంతో అవన్నీ పక్కకెళ్లిపోయాయి. మరో మాటేంటంటే, ఆ వివాదాలే సినిమాని మరింత సక్సెస్‌ అయ్యేలా చేశాయనడంలో తప్పు లేదు. సినిమా ఇండస్ట్రీ నుండి కొందరు విమర్శించినా, చాలా మంది సపోర్ట్‌గా నిలిచారు ఈ సినిమాకి. కాంగ్రెస్‌ నేత హనుమంతరావు ఈ సినిమా పోస్టర్స్‌ సమాజం సిగ్గు పడేలా ఉన్నాయంటూ రగడ చేసినా కానీ అది కూడా కామ్‌ అయిపోయింది. ఇండస్ట్రీలో పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు అర్జున్‌రెడ్డి. విజయ్‌ దేవరకొండ, షాలిని జంటగా తెరకెక్కింది ఈ సినిమా. కాగా ముద్దుగుమ్మ అనుష్క లేటెస్టుగా ఈ సినిమాని చూసింది. అనుష్కకి సినిమా చాలా బాగా నచ్చేసింది. తాను చూడడమే కాకుండా చూడనివారందర్నీ ఖచ్చితంగా సినిమా చూడండి అని చెప్పింది. అనుష్క చెబితే అభిమానులు ఊరుకుంటారా? చూసిన వాళ్లు కూడా ఇంకోసారి చూసేస్తారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కి అనుష్క ట్విట్ఱర్‌ ద్వారా శుభాకాంక్షలు చెబుతూ, అర్జున్‌రెడ్డి మంచి సినిమా అనే ట్యాగ్‌ కూడా ఇచ్చేసింది. ఇంకేముంది దేవసేన మనసును కూడా ఇంతగా గెలిచేసుకున్నాడు అర్జున్‌రెడ్డి.

ALSO READ: వదంతులు నమ్మవద్దు అని చెప్పిన ఎస్పీ బాలు!