ENGLISH

'అర్జున్‌రెడ్డి' అక్కడ 9 కోట్లు

04 September 2017-13:13 PM

సినిమాలో విషయం ఉంటే, వివాదాలతో ఆ సినిమాకి ఏ రకమైన నష్టం ఉండదనీ 'అర్జున్‌రెడ్డి' సినిమా నిరూపించింది. తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ సినిమాకి ఓవర్సీస్‌లోనూ తిరుగు లేకుండా పోయింది. ఓవర్సీస్‌లో 'అర్జున్‌రెడ్డి' వసూళ్ళ ప్రభంజనం కొనసాగుతోంది. ఇంతవరకూ 'అర్జున్‌రెడ్డి' అక్కడ 8.9 కోట్లను దాటేసింది. చిన్న చిత్రాల్లో 'బాహుబలి'గా 'అర్జున్‌రెడ్డి'ని అభివర్ణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ 'అర్జున్‌రెడ్డి' వసూళ్ళ ప్రభంజనం ఏమాత్రం తగ్గలేదు. వివాదాలు ఈ సినిమాకి అదనపు పబ్లిసిటీని ఇస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే సినిమా విడుదలయ్యాక కూడా వివాదాలకు బ్రేక్‌ పడడం లేదు ఈ సినిమా విషయంలో. కాంగ్రెస్‌ నేత హనుమంతరావు గొడవతో పెద్ద పబ్లిసిటీనే దక్కింది ఈ సినిమాకి. ఇక బుల్లితెర స్టార్‌ యాంకర్‌ అనసూయ రగడ సినిమాని మరింత ఎత్తుకు తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇవన్నీ 'అర్జున్‌రెడ్డి'కి బాగా కలిసొచ్చాయని చెప్పక తప్పదు. సినిమా యూనిట్‌ చేసిన పబ్లిసిటీ కన్నా ఈ రకంగా తలెత్తిన వివాదాలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. సినిమా చూడాలన్న ఆశక్తి నెలకొంది. దాంతో సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది. కేవలం ఏదో ఒక వర్గం ప్రేక్షకులే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఈ సినిమాలో ఏముందో తెలుసుకోవాలనే ఆశక్తితో ధియేటర్స్‌కి వెళ్తున్నారు. సినిమా చూసి వచ్చాక బాగుంది అనే సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. దాంతో 'అర్జున్‌రెడ్డి' సక్సెస్‌ రేట్‌ పెరిగిపోతోంది. ఇండస్ట్రీ నుండి కూడా ఈ సినిమాకి ఫుల్‌ సపోర్ట్‌ దక్కుతోంది. ఆ రకంగా 'అర్జున్‌రెడ్డి' హిట్‌ నుండి సూపర్‌ హిట్‌ సినిమాల జాబితాలోకి చేరిపోయింది.

ALSO READ: హ్రితిక్ గుట్టు విప్పిన కంగనా?!