అర్జున్ రెడ్డి- ఇప్పుడు ఈ సినిమాకి తెలుగు నాట మంచి క్రేజ్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, తెలుగు మాట్లాడే వాళ్ళు గణనీయంగా ఉన్న అమెరికాలో సైతం ఈ చిత్రానికి బాగా ఆదరణ దొరుకుతున్నది.
ఇప్పటికే 1 మిలియన్ క్లబ్ లో చేరిపోయిన ఈ సినిమా ఈరోజు ఉదయానికి 1.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి అమెరికాలో విజయవంతమైన తెలుగు చిత్రాల సరసన నిలిచింది. ఈ కలెక్షన్స్ జోరు చూస్తుంటే, త్వరలోనే ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల మార్కుని దాటి సంచలనం రేపే అవకాశం లేకపోలేదు.
ఇక అర్జున్ రెడ్డి కలెక్షన్ల సునామి రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ పైసా వసూల్ విడుదలైనప్పటికీ అర్జున్ రెడ్డి వసూళ్లు తగ్గకపోగా థియేటర్ల సంఖ్య కూడా పెరిగిందని చెప్పొచ్చు.
చూద్దాం.. మరి రాబోయే రోజుల్లో అర్జున్ రెడ్డి ఇంకెన్ని కోట్లు కొల్లగోట్టనుందో..
ALSO READ: షాకింగ్: రోబో 2.0 స్టోరీ లీక్..?